రేపు ఢిల్లీలో ధర్నా-చంద్రబాబు

రేపు ఢిల్లీలో ధర్నా-చంద్రబాబు

ఇప్పటికే ఈవీఎంపై పనితీరుపై ఆందోళన వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... వీవీ ప్యాట్లలోని స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీని కోసం రేపు మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీ వేదికగా ధర్నా చేయనున్నట్టు ప్రకటించారు. టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ముందుగా వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించాలనే డిమాండ్‌తో రేపు ఆందోళన చేస్తామన్నారు. మైండ్ గేమ్స్ తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదం చేసిందని మండిపడ్డ ఆయన.. ఎన్నికల కమిషన్ చేసిన దుర్వినియోగం అంతా ఇంతా కాదన్నారు. ఎన్నికల కౌంటింగ్‌లో అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించి చంద్రబాబు.. వీవీ ప్యాట్ల లెక్కింపులోనూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ భయభ్రాంతులు సృష్టిస్తున్నారని ఆరోపించారు ఏపీ సీఎం.