రేపు విశాఖలో జనసేన, వామపక్షాల సమావేశం

రేపు విశాఖలో జనసేన, వామపక్షాల సమావేశం

జనసేన, వామపక్షాల సమావేశం శుక్రవారం విశాఖపట్నంలో జరగనుంది. సాయిప్రియా రిసార్ట్స్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్నికల పొత్తులు, మెనిఫెస్టో, ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలి.. తదితర అంశాలపై జనసేన అధ్యక్షడు పవన్, ఆ పార్టీ మరో నేత నాదేండ్ల మనోహర్ లు వామపక్ష నేతలతో కలిసి చర్చిస్తారు. ఈ సమావేశానికి సీపీఐ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఎం పోలిట్ బ్యూరో  సభ్యులు బి.వి.రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఇతర వామపక్ష నేతలు హజరుకానున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని.. వామపక్షాలు తప్ప ఎవరితోనూ కలిసే ప్రసక్తేలేదని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ‘‘వామపక్షాలతో తప్ప ఎవరితో కలిసి వెళ్లము. 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ. యువతకు, మహిళలకు అధిక ప్రాధాన్యం. అధికార, ప్రతిపక్షాల మాటలను ముక్తకంఠంతో ఖండించండి’’ అంటూ ఓ పోస్టర్‌ని కూడా ట్విట్టర్‌లో ఉంచారు.