బ్యాడ్‌ న్యూస్‌: రేపు మద్యం షాపులు బంద్..

బ్యాడ్‌ న్యూస్‌: రేపు మద్యం షాపులు బంద్..

మందు బాబులకు బ్యాడ్ న్యూస్... రేపు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మద్యం షాపులు మూతపడనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ రేపు జరనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, వైన్స్‌లు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలంటూ ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రేపు మద్యం షాపులు మూసివేయాలంటూ ఆబ్కారీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 23న ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు తెరవకూడదని.. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది ఎక్సైజ్ శాఖ.