రేపు 10 కంపెనీలకు మంత్రి లోకేష్ శ్రీకారం

రేపు 10 కంపెనీలకు మంత్రి లోకేష్ శ్రీకారం

రేపు తిరుపతిలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు.పది ఎలక్ట్రానిక్స్  కంపెనీల ఏర్పాటుకు మంత్రి లోకేష్ భూమి పూజ చేయనున్నారు.తొలుత కార్బన్ మొబైల్స్ తయారీ కంపెనీని లోకేష్ ప్రారంభిస్తారు. తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1 లో రూ.80 కోట్ల పెట్టుబడితో కంపెనీ ఏర్పాటవుతోంది. 700 మందికి ఈ కంపెనీ ఉద్యోగాలు కల్పిస్తుంది. రూ. 653 కోట్ల పెట్టుబడితో వోల్టాస్ తమ నూతన కంపెనీని ప్రారంభిస్తుంది. ఈఎంసి 2 లో రూ.145 కోట్ల పెట్టుబడితో డిక్సన్ మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. మొత్తంగా రూ.1445 కోట్ల పెట్టుబడి,7088 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు.