పాలీసెట్ ర్యాంకర్లు వీరే..

పాలీసెట్ ర్యాంకర్లు వీరే..

ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 30న‌ నిర్వహించిన ప్రవేశ పరీక్షకు  సంబంధించిన ఫలితాలను ప్రకటించారు అధికారులు. మొత్తం 1,31,931 మంది విద్యార్థులు ఏపీ పాలీసెట్‌ 2019కి దరఖాస్తు చేసుకోగా.. 1,24,899 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇవాళ విడుదల చేసిన ఫలితాల్లో 82 శాతం బాలురు, 87 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. పాస్‌ అయిన వారిలో బాలురు 70,051 మంది కాగా, బాలికలు 35,276 మంది. ఇక 209 కళాశాలల్లో 75,971 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మే 24 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనుండగా.. దీనికి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇక ఆన్ లైన్ నుంచి ర్యాంకు కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. దీనికి పాస్ వర్డ్.. "cteap2019#''గా ఉంది. ఇక జూన్ 6వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభంకానున్నాయి. ఈఏడాది పాలీసెట్ ఫలితాల్లో గోదావరి జిల్లాల విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 10 ర్యాంకుల్లో 9 ర్యాంకులు గోదావరి జిల్లాలకు చెందిన విద్యార్థులే కైవసం చేసుకున్నారు. వీరిలో ఐదుగురు తూర్పు గోదావరి జిల్లాకు చెందనవారు కాగా... నలుగురు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన విద్యార్థులు.. ఒకరు గుంటూరుకు చెందిన విద్యార్థి ఉన్నారు. 

పాలీసెట్‌లో టాప్ 10 ర్యాంకర్లు వీరే:
1. చింతా శివమాధవ్ (తూర్పు గోదావరి)
2. మద్దులపల్లి ఫణి (గుంటూరు)
3. చందం వివేక్  (తూర్పు గోదావరి)
4. కొమ్ముల చైత్రి (పశ్చిమ గోదావరి)
5. ఆకేళ్ల శ్రీనివాస్ (పశ్చిమ గోదావరి)
6. లింగాల అనంత్  (పశ్చిమ గోదావరి)
7. చందన కిరణ్మయి (తూర్పు గోదావరి)
8. వి.ఆదిత్య (తూర్పు గోదావరి) 
9. అప్పరి హర్షిత (తూర్పు గోదావరి) 
10. పిచ్చాని గుణం (పశ్చిమ గోదావరి)