వావ్‌ ధోనీ..! టాప్‌ 6 ట్రెండ్స్‌లోనూ మహీయే..

వావ్‌ ధోనీ..! టాప్‌ 6 ట్రెండ్స్‌లోనూ మహీయే..

మిస్టర్ కూల్, భారత జట్టు మాజీ సారథి, బెస్ట్ ఫినిషర్ ఎంఎస్ ధోనీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులు, సహచర క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, విదేశీ ఆటగాళ్లు, ఫ్యాన్స్ అనే తేడా లేకుండా సోషల్ మీడియా వేదికగా ఎంఎస్ ధోనీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. శుభాకాంక్షలు ఏరేంజ్‌లో ఉన్నాయంటే.. ట్విట్టర్‌లో ఇండియా ట్రెండ్స్‌లో టాప్‌ టెన్‌లో.. వరుసగా ధోనీకి బర్త్‌డే విషెస్ చెప్పే ఆరు యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. టాప్ స్పాట్‌లో హ్యాపీబర్త్‌డే ధోనీ, ఆ తర్వాత హ్యాపీ బర్త్‌డే ఎంఎస్‌డీ, మూడో స్థానంలో ఎంఎస్‌ ధోనీ, నాల్గో స్థానంలో ఎంఎస్‌డీ 38, ఐదో స్థానంలో మహీ, ఆరో స్థానంలో కెప్టెన్‌ కూల్‌.. యాష్‌ట్యాగ్స్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయంటే.. మహీకి ఏ రేంజ్‌లో శుభాకాంక్షలు తెలుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కాగా, 38వ ఏడాదికి అడుగుపెట్టిన ఎంఎస్ ధోనీ.. శనివారం రాత్రి శ్రీలంకపై విజయం సాధించిన తర్వాత తన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు. భార్య సాక్షి, కుమార్తె జీవాలతో పాటు టీమిండియా క్రికెటర్లు ధోనీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి తర్వాత అందరితో సంతోషంగా గడిపాడు ధోనీ.