ఈసీని వివరణ కోరిన సుప్రీం కోర్టు

ఈసీని వివరణ కోరిన సుప్రీం కోర్టు

కేంద్ర ఎన్నికల కమిషన్‌కి సుప్రీం కోర్టు నోటీసిచ్చింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి వివరణ కోరింది. అమిత్‌ షా, స్మృతిఇరానీలు లోక్‌సభకు ఎన్నికవడంతో ఆ 2 స్థానాలకూ వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావించింది. వేర్వేరుగా నోటిఫికేషన్లనూ విడుదల చేసింది. ఐతే.. రెండు స్థానాలకూ ఒకేసారి ఎన్నిక నిర్వహించాలని కోరుతూ సుప్రీం కోర్టులో కాంగ్రెస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇవాళ పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ నెల 24వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది.