టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల మీట్‌..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల మీట్‌..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లందరూ ఒకే చోట కలిశారు. కలిసి డిన్నర్‌ చేశారు. తెల్లవార్లూ కబుర్లు చెప్పుకున్నారు. ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. ఏకంగా 9 మంది దర్శకులు కలిసి పార్టీ చేసుకున్నారు. రాజమౌళి, సుకుమార్‌, క్రిష్‌, కొరటాల శివ, హరీష్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, నాగ్‌ అశ్విన్‌, సందీప్‌రెడ్డి.. ఈ డైరెక్టర్లంతా వంశీపైడిపల్లి ఇంట్లో కలిశారు. ఈ ఫొటోలను  రాజమౌళి తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు. అనుకోకుండా కలిశామని, ప్రత్యేకతేమీ లేదని రాజమౌళి చెప్పారు. ఏటా ఓ రోజు ఇలానే అందరం కలుసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు.