ఎంసెట్ టాప్ ర్యాంకర్స్ వీరే..

ఎంసెట్ టాప్ ర్యాంకర్స్ వీరే..

తెలంగాణ ఎంసెట్ 2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్‌-2019 పరీక్ష ఫలితాలను జేఎన్‌టీయూ హైదరాబాద్‌ లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి, జేఎన్‌టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ యాదయ్య విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ను మొత్తం 1,42,210 దరఖాస్తుచేస్తే.. అందులో 1,31,209 మంది రాశారని.. దీనిలో 1,18,213 క్వాలిఫై అయ్యారని.. అంటే 82.47 శాతం ఉత్తీర్ణ సాధించారని తెలిపారు. ఇక అగ్రికల్చర్ విభాగంలో 74989 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 68550 మంది పరీక్ష రాశారు.. ఇక 63758 క్వాలిఫై అయ్యారు. అంటే 93.01శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అనిట్టు అధికారులు ప్రకటించారు. 
ఇంజినీరింగ్ టాప్ ర్యాంకర్స్: 
1. కె. రవిశ్రీ తేజ - తాడేపల్లిగూడెం (ఏపీ) (95.48)
2. చంద్రశేఖర్ - హైదరాబాద్ (94.65)
3. ఆకాష్ రెడ్డి - హైదరాబాద్ (93.16)
4. కార్తికేయ - హైదరాబాద్ (93.03)
5. భానుదత్త - భీమవరం, ఏపీ (92.05)
6. సాయి వంశీ - హైదరాబాద్ (91.76)
7. సాయివిజ్ఞ - హైదరాబాద్ (91.47)
8. కశ్యప్ - గిద్దలూరు, ఏపీ (91.79)
9. వేద ప్రణవ్ - హైదరాబాద్ (90.60)
10. అభిజిత్ రెడ్డి - హైదరాబాద్ 

ఎంసెట్ అగ్రికల్చర్ &ఫార్మసి టాప్ ర్యాంకర్స్:
1. పుష్పంత్ - భూపాలపల్లి
2. దాసరి కిరణ్ కుమార్ రెడ్డి - రాజమండ్రి, ఏపీ
3. వెంకటసాయి అరుణ్ తేజ - కాకినాడ, ఏపీ
4. సుంకర సాయి స్వాతి - తిరుపతి, ఏపీ
5. అక్షయ్ - హైదరాబాద్
6. మౌనిషా ప్రియ - మదురై, తమిళనాడు..
7. బుర్ర శివాని శీవాత్సవ్ - నిజామాబాద్
8. సిద్దార్ద భరద్వాజ్ - విశాఖ, ఏపీ
9. పూజ - తిరుపతి, ఏపీ
10. అసిత - హైదరాబాద్