దీపావళి కోసం ముగ్గురు హీరోలు వెయిటింగ్...!!
దసరా సందడి ముగిసింది. ఇప్పుడు దీపావళి సినిమా సందడి మొదలైంది. దీపావళికి పెద్ద హీరోల సినిమాలు రాకపోయినా... సర్కార్ రూపంలో విజయ్ డబ్బింగ్ సినిమా, అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాలు సందడి చేయబోతున్నాయి. వీటికంటే ముందే నాగచైతన్య సవ్యసాచి థియేటర్స్ కు వస్తున్నది. ఈ మూడు సినిమాలపై మంచి హైప్ ఉన్నది.
ఇదిలా ఉంటె, ఈ దీపావళి కోసం మరో ముగ్గురు హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో మొదటి వ్యక్తి రామ్ చరణ్. చరణ్.. బోయపాటి సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం అందుతున్నది. వినయ విధేయ రామ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నా.. అఫీషియల్ గా మాత్రం కన్ఫామ్ కాలేదు.
దీపావళి రోజునే వెంకటేష్.. వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ఎఫ్2ఎఫ్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కోసమే వెయిట్ చేస్తున్న మరో హీరో కళ్యాణ్ రామ్. సినిమాతో గ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను దీపావళికి రిలీజ్ చేయబోతున్నారు. దీపావళి ముందు రోజు లేదా దీపావళి రోజున ఈ మూడు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లు రిలీజ్ కానున్నాయి. ఇది వారి ఫ్యాన్స్ కు పెద్ద పండుగే అని చెప్పొచ్చు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)