టి 20కి వరుణుడి అడ్డంకి ..!! 

టి 20కి వరుణుడి అడ్డంకి ..!! 

ఇండియా.. సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈరోజు నుంచి మూడు టి 20 మ్యాచ్ లు ప్రారంభం అవుతున్నాయి.  మొదటి టి 20 మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరుగుతున్నది.  గత కొన్నిరోజులుగా అక్కడ వర్షాలు కురుస్తున్నాయి.  నిన్నటి రోజున కూడా భారీ వర్షం కురిసింది.  పిచ్ తడవకుండా కవర్లు కప్పి ఉంచారు.  కాగా, ఈరోజు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఇప్పటి వరకు మొదలు కాలేదు.  ఆకాశం మేఘావృతం కావడం..వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.  టి 20 మ్యాచ్ జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.  

భారత్‌: శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్య, కృనాల్ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, రాహుల్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైని.

దక్షిణాఫ్రికా: క్వింటన్‌ డికాక్‌ (కెప్టెన్‌), రీజా హెండ్రిక్స్‌, బవుమా, వాండర్‌ డసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, రబాడ్‌, జూనియర్‌ డలా, తబ్రియాజ్‌ షంసి, జార్న్‌ ఫోర్టుయిన్‌