ఇంగ్లాండ్-వెస్టిండీస్ : టాస్ పడకుండానే మొదటి సెషన్ రద్దు... 

ఇంగ్లాండ్-వెస్టిండీస్ : టాస్ పడకుండానే మొదటి సెషన్ రద్దు... 

కరోనా విరామం తర్వాత ఈ రోజు ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ సౌతాంప్టన్‌లోని అగాస్ బౌల్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆట సమయానికి మంచు ఎక్కువ కురవడంతో టాస్ కు ఆలస్యం అయ్యింది. ఇక ఆ తర్వాత వరుణుడి రాకతో మొదటి రోజు మొదటి సెషన్ ఆయనకు అర్పితం అయిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు ఆటగాళ్లకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. మరి ఈ విరామం తర్వాత ప్రారంభం కావాల్సిన రెండో సెషన్ లోనైనా కనీసం టాస్ పడుతుందా... లేదా రోజు మొత్తం వరుణుడి అకౌంట్లోకి వెళ్తుందా.. అనేది చూడాలి.