'ఏబిసిడి'ని ఎంతమంది చూశారో తెలుసా ?

'ఏబిసిడి'ని ఎంతమంది చూశారో  తెలుసా ?

అల్లు శిరీష్, రుక్సార్ మీర్ జంటగా నటించిన చిత్రం 'ఏబిసిడి'.  సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గత వారమే రిలీజ్ చేశారు.  మొదటి రోజు నుండి మిశ్రమ స్పందనతో సాగుతున్న ఈ సినిమా వసూళ్లు మీడియం స్థాయిలోనే ఉన్నాయి.  చిత్ర టీమ్ నుండి అందుతున్న సమాచారం మేరకు ఏపి, తెలంగాణల్లో ఇప్పటి వరకు ఈ సినిమాను 9,06,262 మంది వీక్షించినట్టు తెలుస్తోంది.  ఇలా సినిమాను చూసిన జనం సంఖ్యను చెబితే ప్రమోషన్లకు సాయపడుతుంది టీమ్ ఉద్దేశ్యం కావొచ్చు.