మజిలీ దూకుడుకు జెర్సీ అడ్డుకట్ట వేస్తుందా...?
ఏప్రిల్ నెల టాలీవుడ్ ఇండస్ట్రీకి ది బెస్ట్ నెలగా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఏప్రిల్ 5 వ తేదీన మజిలీ రిలీజ్ అయ్యింది. యువకుడి ఫెయిల్యూర్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా భారీ హిట్టైంది. కలెక్షన్ల పరంగా సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. నాగచైతన్య కెరీర్లోనే హయ్యస్ట్ వసూళ్లుగా నిలిచింది. దీని తరువాత ఏప్రిల్ 12 వ తేదీన మరో ఫెయిల్యూర్ స్టోరీతో వచ్చిన చిత్రలహరి కూడా డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లు రాబడుతున్నది.
ఆరు పరాజయాల తరువాత సాయి ధరమ్ మంచి హిట్ కొట్టాడు. మజిలీలో పోలిస్తే కలెక్షన్లు కొద్దిగా తక్కువనే చెప్పాలి. ఈరోజు నాని జెర్సీ రిలీజ్ అయ్యింది. జీవితంలో, క్రికెట్లో ఫెయిల్యూర్ అయిన ఓ యువకుడి కథతో తెరకెక్కింది. ఇంచుమించు మజిలీ లాంటి స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో రావడం, నాని తన పెరఫార్మన్స్ తో అదరగొట్టడంతో సినిమాకు మంచి టాక్ వచ్చింది. కలెక్షన్ల పరంగా ఫస్ట్ డే డీసెంట్ గా వస్తున్నాయి. మంచి వసూళ్లతో దూసుకుపోతున్న మజిలీకి జెర్సీ అడ్డుకట్ట వేసేలానే కనిపిస్తోంది. జెర్సీతో పాటు ఈరోజు లారెన్స్ కాంచన 3 రిలీజ్ అయ్యింది.
హర్రర్ కామెడీ జానర్ తో వచ్చిన ఈ సినిమాకు మాస్ లో మంచి క్రేజ్ రావడం మజిలీకి, చిత్రలహరికి ఇబ్బందే అని చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే టాలీవుడ్ కు ఈ ఏప్రిల్ నెల కలిసొచ్చిందని చెప్పొచ్చు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)