హైదరాబాద్ నుంచి 22.. వరంగల్ నుంచి 14 ... 

హైదరాబాద్ నుంచి 22.. వరంగల్ నుంచి 14 ... 

గోదావరిలో పాపికొండల విహారయాత్ర విషాదంగా మారింది.  ఈ ఉదయం 61 మంది ప్రయాణికులతో బయలుదేరిన రాయల్ వశిష్ట లాంచీ దేవీపట్నం మండలంలోని కచులూరు మందం వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురయ్యి మునిగిపోయింది.  ప్రమాదం జరిగిన తరువాత పడవ ఒక పక్కకు ఒరిగిందని క్రమంగా పడవ నీళ్లలో మునిగిపోయిందని వరంగల్ వాసి తెలియజేశారు.  ఈ విహార యాత్ర కోసం హైదరాబాద్ నుంచి 22 మంది, వరంగల్ నుంచి 14 మంది వచ్చాడు.  వరంగల్ నుంచి వచ్చిన 14 మందిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, 9 మంది గల్లంతయ్యారు.  గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.  కాగా, ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను వెలికితీశారు.