టీఆర్ఎస్ గెలిస్తే.. వంద గొర్రెల్లో ఇంకో గొర్రె చేరుతుంది..!

టీఆర్ఎస్ గెలిస్తే.. వంద గొర్రెల్లో ఇంకో గొర్రె చేరుతుంది..!

తెలంగాణలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతోన్న ఎన్నికలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి.. కాంగ్రెస్ కంచుకోటలో మరోసారి జెండా ఎగరేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. ఆ కంచుకోటనే బద్దలు కొట్టాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అయితే, హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలిస్తే.. వంద గొర్రెల్లో ఇంకో గొర్రె చేరుతోందని హాట్ కామెంట్ చేశారు పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి... హుజూర్‌నగర్‌లో తాము చేసిన సేవే మరోసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుందన్న ఆయన.. ఈ ఉప ఎన్నిక ఆత్మగౌరవానికి సంబంధించినదని.. ఈ ఎన్నికలు నా రాజకీయ జీవితంపై కూడా ప్రభావం చూపనున్నాయని తెలిపారు. ఇక హుజూర్‌నగర్‌లో ఎలాంటి ఫలితాలు వచ్చినా నేనే బాధ్యుడిని అన్న ఉత్తమ్... ఎన్నికల తర్వాత ఆర్టీసీ కార్మికుల సమ్మెపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులను తొక్కేయాలని చూడడం సరికాదన్నారు.