ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వార్నింగ్‌..పీసీసీ మార్పుపై మాట్లాడొద్దని క్లాస్‌

ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వార్నింగ్‌..పీసీసీ మార్పుపై మాట్లాడొద్దని క్లాస్‌

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్షుడు క్లాస్‌ తీసుకున్నారు...పీసీసీ మార్పుపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది...రేవంత్‌ రెడ్డికి టీ-పీసీసీ పదవి వస్తుందని ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి..రేవంత్‌కు పీసీసీ ఇస్తే వ్యతిరేకిస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించడంతో సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది...ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని టీ-పీసీసీ పదవి నుంచి మార్చాల్సిన అవసరం లేదని జగ్గారెడ్డి ప్రకటించారు..మార్చే అవకాశాలు ఉంటే పీసీసీ రేస్‌లో నేను కూడా ఉన్నాని జగ్గారెడ్డి పేర్కొన్నారు..
వివాదం మరింత ముదరకముందే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రంగంలోకి దిగి జగ్గారెడ్డిని మందలించారు..పీసీసీ మార్పుపై ఇప్పుడు మాట్లాడాల్సిన అవరసం ఏముందని మందలించారు..టీపీసీసీ మార్పుపై ఇప్పుడు ఎవరు మాట్లాడొద్దని, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఉత్తమ్‌ పేర్కొన్నారు..కాగా జగ్గారెడ్డి తను ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చిందో...మరోసారి టీ-పీసీసీ మార్పుపై మాట్లాడనని జగ్గారెడ్డి టీ-పీసీసీ అధ్యక్షుడికి వివరణ ఇచ్చారు..