కాంగ్రెస్‌ ప్రచారానికి 4 టీమ్‌లు..

కాంగ్రెస్‌ ప్రచారానికి 4 టీమ్‌లు..

 పీసీసీ స్థాయి నాయకులంతా ఇంటింటి ప్రచారంలో పాల్గొనాల్సిందేనని కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇవాళ పీసీసీ కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ నవంబర్ 1 నుంచి 7 వరకు నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. మొత్తం నాలుగు టీమ్‌లు ప్రచారం చేస్తాయన్నారు. ఉత్తమ్‌, భట్టి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డిల నేతృత్వంలో ఈ బృందాలు పనిచేస్తాయని కుంతియా చెప్పారు. 'ఎన్నికలకు దాదాపు 45 రోజులుంది. ఈ 45 రోజులూ పార్టీ కోసం పనిచేయండి. ఆషామాషీగా కాదు.. సీరియస్‌ ఫైట్‌ చేస్తున్నాం. ప్రతిఒక్కరూ సైనికుడిలా పనిచేయాలి' అని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు.