కాంగ్రెస్‌లో పొత్తులపై వాడివేడి చర్చ..

కాంగ్రెస్‌లో పొత్తులపై వాడివేడి చర్చ..

పొత్తుల వివాదంపై కాంగ్రెస్‌లో ఇంకా విభేదాలు సద్దుమణిగినట్టు లేవు. ఇదే అంశంపై ఇవాళ జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఎంపీ నంది ఎల్లయ్య సీరియస్‌ అయ్యారు. 'ఎవరిని అడిగి పొత్తులు ఖరారు చేస్తున్నారు?  కనీసం ఎంపీ లకు కూడా సమాచారం ఇవ్వరా? గెలవడానికి పొత్తులు పెట్టుకుంటున్నారా..? ఓడిపోవడానికా..?' అని ప్రశ్నించారు.  గెలిచే సీట్లన్నీ ఇచ్చేసి ఓడిపోయేవి తీసుకుంటున్నారని విమర్శించారు. దీనికి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ స్పందిస్తూ అధిష్టానం ఆదేశాల ప్రకారమే పొత్తులు ఖరారు చేశామన్నారు. '20 నుంచి 25 సీట్లు పొత్తుల్లో పోతాయి. 90 పైచిలుకు మనం పోటీ చేస్తున్నాం' అని చెప్పారు.  పొత్తుల వల్ల సీట్లు నష్టపోయే వారు బాధపడొద్దని.. అధికారంలోకి వచ్చాక వాళ్లకే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.