టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరికి ఛాన్స్‌..?

టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరికి ఛాన్స్‌..?

తెలంగాణలో కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ కసరత్తు మొదలు పెట్టింది. వారం రోజులగా ఢిల్లీలోనే ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నుంచి అధిష్టానం కీలక వివరాలను సేకరిస్తోంది. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డితో కూడా పార్టీ పెద్దలు మంతనాలు జరిపారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఒకేసారి ఎందుకు పార్టీ మారారు..? రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రస్తుత పరిస్థితి ఏంటి..? పార్టీ పట్ల విధేయత చూపెడుతోంది ఎవరకు..? వంటి వివరాలను ఉత్తమ్‌, భట్టి నుంచి అడిగి తెలుసుకున్నారు. 

రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్లపాటు పార్టీని సమర్థంగా నడిపించడం, అటు టీఆర్‌ఎస్‌.. ఇటు బీజేపీని దీటుగా ఎదుర్కోనడంతోపాటు పార్టీకి విధేయులుగా ఉండేవారికి అధ్యక్ష పదవి అప్పగించాలని అధిష్టానం భావిస్తోంది ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితోపాటు ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ రేసులో ఉన్నట్టు తెలిసింది.