ఏ కారణాలతో పార్టీ వీడుతున్నారో నాకు చెప్పారు

 ఏ కారణాలతో పార్టీ వీడుతున్నారో నాకు చెప్పారు

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆయన ఏకారణాలతో పార్టీ వీడుతున్నారో తనకు చెప్పారన్నారు. ఢిల్లీలో ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కారణాలతో పార్టీ మారే వారికి ఏదైనా చెప్పొచ్చన్నారు. కానీ ఆర్థికపరమైన కారణాలతో వెళ్లే వారికి ఏం చెప్పగలమని ఆయన ప్రశ్నించారు. రాజగోపాల్‌ రెడ్డి ఏ కారణాలతో పార్టీ వీడుతున్నారో తనకు చెప్పారని తెలిపారు. వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైనా చెబుతారన్నారు. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై ఏఐసీసీ పెద్దలతో చర్చిస్తానని ఉత్తమ్ తెలిపారు.