పియూష్ పద్దులపై పొన్నం నారాజ్

పియూష్ పద్దులపై పొన్నం నారాజ్

పియూష్ గోయల్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు.  కేంద్ర బడ్జెట్ పై మీడియాతో మాట్లాడిన పొన్నం.. టాక్స్ పరిధిని పెంచేసి వచ్చే ఏడాది నుండి అమలు చేస్తామని చెప్పటం విడ్దూరంగా ఉందన్నారు.వ్యాపారస్థుల మన్ననలు పొందే ప్రయత్నం చేసిన మోడీ సర్కార్, పన్ను ఎగవేత దారుల గురించి ఎందుకు మాట్లాడలేదో అర్ధం కావడం లేదని అన్నారు. నాలుగున్నరేళ్లలో బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. 

దేశంలో ఏ స్కీమ్ వచ్చినా.. వీళ్ళే ఆదర్శం అన్నట్టు..అన్నా,చెల్లి డప్పు కొట్టుకుంటున్నారని  కేటిఆర్, ఎంపి కవితని పొన్నం ఎద్దేవా చేశారు. తమ స్కీమ్ ని మోడీ కాపీ కొట్టారని కేటీఆర్ అంటే...ఎంపి కవిత కూడా కేంద్రం కాపీ సరిగా కొట్టలేక పోయిందని అంటుందని ఎత్తిపొడిచారు. బీజేపీతో దోస్తీ చేయాలి అన్నదే టిఆర్ఎస్ మనుసులో ఉన్న ఆలోచన అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తేల్చి చెప్పారు. మోడీ వల్ల దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, వచ్చే ఎన్నికల్లో సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పొన్నం స్పష్టం చేశారు.