నర్సారెడ్డిని పరామర్శించిన రేవంత్ రెడ్డి

నర్సారెడ్డిని పరామర్శించిన రేవంత్ రెడ్డి

సాగునీటి ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహర దీక్ష చేపట్టిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేసి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే, తన దీక్షను ఆస్పత్రిలోనే కొనసాగిస్తానని నర్సారెడ్డి స్పష్టంచేశారు. ప్రాజెక్ట్ నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాంకుండా రైతులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.