హరీష్ పై రేవంత్ సంచలన ఆరోపణలు

హరీష్ పై రేవంత్ సంచలన ఆరోపణలు

మాజీ హరీష్ రావుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. చిట్ చాట్  లో మాట్లాడిన రేవంత్.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, టిఆర్ఎస్ లో ఉన్న 30 మందికి హరీష్ రావు ఎన్నికల ఖర్చు ఇచ్చారని బాంబు వేసారు.  కాంగ్రెస్ లో కొందరు తీసుకోలేదని, టిఆర్ఎస్ లో 26 మంది తీసుకున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కి తెలియకుండా ఇవ్వడం వల్లే .. ఆయన్ని కేసిఆర్ పక్కన పెట్టారని రేవంత్ ఆరోపించారు. అమిత్ షా తో హరీష్ మాట్లాడిన వీడియోని సీఎం పిలిచి వినిపించారని అన్నారు. హరీష్ కి మంత్రి పదవి ఉండదని రేవంత్ రెడ్డి చెప్పారు. త్వరలోనే హరీష్ వ్యవహారానికి చెందిన డాక్యుమెంట్లు బయట పెడతానని స్పష్టం చేసారు.