వాటికి అనుమతిస్తేనే... భారత్ కు ఆ హోదా ఇస్తుందా?

వాటికి అనుమతిస్తేనే... భారత్ కు ఆ హోదా ఇస్తుందా?

ఈనెల 24 వ తేదీన ట్రంప్ ఇండియా రాబోతున్నారు.  ట్రంప్ రాకతో అనేక రెండు దేశాల మధ్య అనేక వాణిజ్యపరమైన ఒప్పందాలు జరగబోతున్నట్టు తెలుస్తోంది.  2018 వరకు భారత్ కు ప్రాధాన్య వాణిజ్య హోదా ఉన్నది.  అయితే ట్రంప్ సర్కార్ 2019 లో భారత్ కు దీని నుంచి తప్పించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ట్రేడింగ్ విషయంలో కొంత అనిశ్చితి నెలకొన్నది.  ఇండియా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక సుంకం విధిస్తుండటమే ఇందుకు కారణం.  

అయితే, అమెరికా రెండు విషయాలపై పట్టుబడుతున్నది.  అందులో ఒకటి పాల ఉత్పత్తలు కాగా, రెండోది చికెన్.  ప్రపంచంలో పాల ఉత్పత్తులలో ఇండియా టాప్ లో ఉన్నది.  ఇక్కడ పాల ఉత్పత్తులు అధికంగా ఉంటాయి.  కానీ, ఇండియాకు పాల ఉత్పత్తులు ఎగుమతి చేసే విషయంలో అనుమతి కావాలని అమెరికా పట్టుబడుతున్నది.  కానీ, ఇందుకు ఇండియా ఒప్పుకోవడం లేదు.  దీనిపై ఇప్పుడు కొంత సడలించే అవకాశం ఉన్నది.  అలానే చికెన్ విషయంలో 100 శాతం సుంకాలు విధిస్తు వస్తున్న ఇండియా, ఇప్పుడు సడలించి 25శాతం సుంకాలు విధించే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.  ఈ రెండు విషయాల్లో ఇండియా కాస్త పట్టు విడిస్తే... తిరిగి అమెరికా ప్రాధాన్య వాణిజ్య హోదా ఇచ్చే అవకాశం ఉంటుంది.