అర్ధరాత్రి వరకు షేర్ల ట్రేడింగ్‌

అర్ధరాత్రి వరకు షేర్ల ట్రేడింగ్‌

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) సంచలన నిర్ణయం తీసుకుంది. భారత స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్ల ట్రేడింగ్‌ అర్ధరాత్రి వరకు జరిపేందుకు అనుమతి ఇచ్చింది. ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 11.15 వరకు ట్రేడింగ్‌ చేసుకోవచ్చు. అయితే ఈ పొడిగింపు ట్రేడింగ్‌ కేవలం ఈక్విటీ డెరివేటివ్స్‌కు మాత్రమే వర్తిస్తాయి. దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి పొడిగించిన వేళలు అమల్లోకి వస్తాయి. ఈ లోగా టెక్నికల్‌ సమస్యలతో పాటు రిస్క్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సెబీ నుంచి అనుమతి పొందిన తరవాతే ట్రేడింగ్‌ ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉదయం నుంచి 9.15 నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రేడింగ్‌ జరుగుతోంది.