రంజాన్ విధుల్లో కానిస్టేబుల్ మృతి..

రంజాన్ విధుల్లో కానిస్టేబుల్ మృతి..

రంజాన్ పండుగలో విషాదం జరిగింది.. నిజామాబాద్‌లో రంజాన్ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతిచెందాడు. నిజామాబాద్‌లోని ఖిల్లా చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పుల్లూరి ఆనందం.. ఫిట్స్ తో కుప్పకూలాడు.. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా... మార్గమధ్యలోనే ఆనందం మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో కుటుంసభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. కానిస్టేబుల్ ఆనందంకి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడుగా కాగా.. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు పోలీస్ కమిషనర్ కార్తికేయ.