జగన్‌ క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గర స్తంభించిన ట్రాఫిక్...

జగన్‌ క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గర స్తంభించిన ట్రాఫిక్...

తాడేపల్లిలోని వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం దగ్గర ట్రాఫిక్ స్తంభించింది. సుమారు కిలోమీటరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలను అక్కడే నిలిపి... ఒక్కొక్కరుగా క్యాంపు కార్యాలయంలోకి నడుచుకుంటూ వెళ్తారు వైసీపీ ఎమ్మెల్యేలు. వైసీపీ శాసనసభాపక్ష సమావేశానికి ఎమ్మెల్యేలంతా తరలివస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలతో పాటు అనుచరులు, పార్టీ కార్యకర్తలు కూడా రావడంతో కరకట్ట నుండి నిలిచిపోయాయి వాహనాలు.