ట్రాయ్ చైర్మెన్ శర్మ పదవీ కాలం పెంపు

ట్రాయ్ చైర్మెన్ శర్మ పదవీ కాలం పెంపు

భారత టెలికాం నియంత్రణ సంస్థ ఛైర్మన్‌ పదవీ కాలం మరో రెండేళ్లు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చైర్మెన్ గా ఉన్న రామ్ సేవక్ శర్మ పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుంది. దీనిని కేంద్ర కేబినెట్ నియామక  కమిటి కూడా ఆమోదించింది. దీంతో సెప్టెంబర్ 30, 2020 వరకు ఆయన ట్రాయ్ చైర్మెన్ గా కొనసాగనున్నారు. 2020 సెప్టెంబరు నాటికి ఆయనకు 65ఏళ్లు వస్తుండటంతో అప్పటివరకు శర్మను ఛైర్మన్‌గా కొనసాగించనున్నట్లు కేబినెట్‌ నియామక కమిటీ తెలిపింది. మూడేళ్ల పదవీకాలానికి గానూ 2015 జులైలో శర్మ ట్రాయ్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 

ఇటీవలే ఆర్ఎస్ శర్మ ఆధార్ ఛాలెంజ్ వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కారు. ఆధార్ ఎలా దుర్వినియోగం అవుతుందో తెలపాలంటూ తన ఆధార్ నంబర్ ను ట్విటర్ లో తెలిపారు. సవాల్ ను స్వీకరించిన ఫ్రాన్స్ కు చెందిన హ్యాంకర్ అండర్సన్ ఆధార్ నంబర్ ఆధారంగా శర్మ యొక్క ఈ మెయిల్ ఐడీ, పాన్ కార్డు నంబర్, ఫోన్ నంబర్, బ్యాంకు బ్యాలెన్న్  తదితర వ్యక్తిగత వివరాలన్ని బయటపెట్టాడు. శర్మ ఛాలెంజ్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.