శైలజా రెడ్డి అల్లుడుకి ఆ టెన్షన్ పట్టుకుంది..!!

శైలజా రెడ్డి అల్లుడుకి ఆ టెన్షన్ పట్టుకుంది..!!

శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది.  ఆగష్టు 31 న సినిమాను రిలీజ్ చేస్తున్నారు.  ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజయింది.  టీజర్ పర్లేదనిపించుకుంది.  కాగా, ట్రైలర్ విషయంలో మారుతి  మల్లగుల్లాలు పడుతున్నాడు.  ట్రైలర్ సినిమా ఫేట్ ను నిర్ణయిస్తుంది.  ట్రైలర్ బాగుంది అనుకుంటే థియేటర్ కు ప్రేక్షకులు వస్తారు.  సినిమా బాగుంది అంటే హిట్టయినట్టే.  ఇది వేరే విషయం.  అందుకే దర్శకులు ఆకట్టుకునే విధంగా ట్రైలర్ ను కట్ చేయాలని ట్రై చేస్తుంటారు.  గూఢచారి, గీతా గోవిందం విషయంలో ఇదే జరిగింది.  శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ సోసో గా ఉండటంతో సినిమా ఫెయిల్ అయింది.  శైలజా రెడ్డి అల్లుడు దర్శకుడు మారుతి రెండు మూడు ట్రైలర్స్ కట్ చేసినా నచ్చకపోవడంతో పక్కన పెట్టాడట.  సినిమా విడుదలకు వారం ముందు ట్రైలర్ ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  అప్పటికైనా ట్రైలర్ రిలీజ్ చేస్తారో లేదంటే ఏకంగా సినిమానే రిలీజ్ చేస్తారో చూడాలి.