మహబూబ్‌నగర్‌లో పట్టాలు తప్పిన రైలు..

మహబూబ్‌నగర్‌లో పట్టాలు తప్పిన రైలు..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో రైలు పట్టాలు తప్పింది.. జిల్లాలోని మన్యం కొండ సమీపంలో రైలింజన్‌ పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మహబూబ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లోనే పలు రైళ్లు ఆగిపోయాయి. రాకపోకలు స్తంభించడంతో తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు ప్రయాణికులు. రైళ్లన్నీ ఆగిపోవడంతో జిల్లా బస్టాండ్‌కు ప్రయాణికులు పోటెత్తారు. అక్కడ కూడా బస్సులు లేకపోవడంతో వారంతా నిరాశకు గురయ్యారు. ఓ వైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండగా.. అటు రైళ్లు ఆగకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు.