గుజ్జర్ల ఆందోళన: ఎన్ హెచ్-11 మూసివేత 

గుజ్జర్ల ఆందోళన: ఎన్ హెచ్-11 మూసివేత 

విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు డిమాండ్‌ చేస్తూ రాజస్థాన్‌లో గుజ్జర్లు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాలుస్తోంది.  గత మూడ్రోజులు క్రితం ప్రారంభమైన ఈ ఆందోళన ఇప్పటికే హింసాత్మకంగా మారింది. నాలుగో రోజు ఆందోళన నేపథ్యంలో రైల్వే అధికారులు ఒక రైలును రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు.  గత శుక్రవారం నుంచి ఈ ప్రాంతం గుండా వెళ్లే 250కిపైగా రైళ్లపై ఆందోళన ప్రభావం పడింది. మమ్మల్ని రెచ్చగొట్టొద్దని గుజ్జర్ల ఉద్యమ నేత బైంస్లా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అటు...గుజ్జర్ ఆందోళనకారులు 11వ నెంబర్ జాతీయ రహదారిని మూసివేశారు. ఇది జైపూర్ - ఆగ్రాను కలుపుతోంది. రాజస్థాన్ లోని దౌసా జిల్లా గుండా ఈ జాతీయ రహదారి వెళుతుంది. ఇప్పటికే ఈ ఆందోళన రాష్ట్రంలోని దూల్ పూర్ ,బండి, కరౌలీ,జుంజ్ హునూ జిల్లాలకు పాకింది. నిన్న ధోల్‌పుర్‌ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు గాల్లో కాల్పులు జరిపారు. పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. రాష్ట్రంలో అనేక చోట్ల రోడ్లను దిగ్బంధించారు. రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా నిషేధాజ్ఞలను విధించినట్లు పోలీసులు ప్రకటించారు.