ఏపీ సెక్రటేరియట్ వద్ద ట్రాన్స్ ట్రాయ్ బాధితుల ఆందోళన

ఏపీ సెక్రటేరియట్ వద్ద ట్రాన్స్ ట్రాయ్ బాధితుల ఆందోళన


సెక్రటేరీయేట్ వద్ద పోలవరం ప్రాజెక్ట్ పాత కాంట్రాక్ సంస్థ ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ బాధితులు ముందు నిరసన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో బయటకు వస్తున్న ట్రాన్సట్రాయ్ కంపెనీ ఈడీ సాంబశివరావును ట్రాన్సట్రాయ్ కంపెనీ బాధితులు అడ్డుకున్నారు. ఈ ట్రాన్సట్రాయ్ కంపెనీ బాధితుల్లో పోలవరం సబ్ కాంట్రాక్టర్లు,  మెటిరీయల్ సప్లైర్స్, పలువురు ఉద్యోగులు ఉన్నారు. ఇక మీడియాతో మాట్లాడిన బాదితులు బకాయిలు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తూ వేధింపులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అందరికీ కలిపి 23 కోట్లు చెల్లించాలని ట్రాన్సట్రాయ్ బాధితుల ఈ సందర్భంగా వెల్లడించారు. సచివాలయం సమీపంలో గొడవ జరగడంతో అలెర్టైన పోలీసులు బాధితుల నుంచి ఈడీ సాంబశివరావును తప్పించి పంపేశారు. రెండునర్నేళ్లుగా ట్రాన్సట్రాయ్ కంపెనీ బకాయిలు చెల్లించకుండా వేధిస్తోందని, హైదరాబాదులోని ఆఫీసుకు వెళ్తే పోలీసులతో బయటికి గెంటేయిస్తున్నారని, సగం బిల్లుల చెల్లింపులకు ఒప్పుకోవాలని మాలో కొందరితో బలవంతంగా రాయించుకున్నారని బాధితులు వాపోయారు.

ఇక ఈ అప్పుల బాధతో ఇద్దరు ఆత్మహత్యా యత్నం చేశారని, సీఎం జగన్ కల్పించుకొని  ట్రాన్సట్రాయ్ కంపెనీ మా బకాయిలు చెల్లించేట్లు చేయాలని వారు కోరారు. ఇక ఈ విషయం మీద స్పందించిన ట్రాన్సట్రాయ్ ఈడీ సాంబశివరావు తాను ఇరిగేషన్ అధికారులతో మాట్లాడానని, బిల్లు పాస్ కాగానే ఎండీతో మాట్లాడి అందరి బకాయిలు చెల్లిస్తామని పేర్కొన్నారు. 73 మందికి బకాయి ఉన్న మాట వాస్తవమేనని కంపెనీ ఇబ్బందుల్లో ఉండటం వల్ల చెల్లింపులు చేయలేకపోయామని ఆయన చెప్పుకొచ్చాడు. ఉద్యోగుల బకాయి జీతాలు, పిఎఫ్ సహాతో చెల్లిస్తామని ఆయన పేర్కొన్నాడు.