సన్‌రైజర్స్‌ కొత్త కోచ్‌ ఇతనే..

సన్‌రైజర్స్‌ కొత్త కోచ్‌ ఇతనే..

వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు యాజమాన్యం ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తోంది. గతేడాది రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్‌.. ఈసారి విన్నర్‌ ట్రోఫీకి గురిపెట్టింది. ఇందులో భాగంగా కోచింగ్‌ స్టాఫ్‌ను మార్చాలని నిర్ణయించింది. ఈక్రమంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్ బేలిస్‌ను జట్టు ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది.
ఆస్ట్రేలియాకు చెందిన బేలిస్ కొంతకాలంగా ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌ను ఇంగ్లీష్‌ జట్టు గెలవడంతో కీలక పాత్ర పోషించిన బేలిస్ గతంలోనూ ఐపీఎల్‌లో శిక్షణ ఇచ్చాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా గతంలో వ్యవహరించిన బేలిస్‌.. ఆ జట్టును రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ జట్టుకు కూడా ట్రోఫీని అందిస్తాడని జట్టు యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.