కోమటిరెడ్డి, సంపత్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ...

కోమటిరెడ్డి, సంపత్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ...

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌ కుమార్‌ తెలంగాణ ప్రభుత్వంపై దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై ఈ నెల 27వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రెటరీ, లా సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ను శాసన సభ సభ్యత్వాల బహిష్కరణపై హైకోర్టు ఆదేశాలు పాటించడం లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా... ఆర్డర్ స్పష్టంగా ఉందని ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పష్టం చేశారు. కౌంటర్ లో సమాధానం ఏం సమాధానం ఇస్తారో చూశాక స్పందిస్తామని వ్యాఖ్యానించిన జస్టిస్ బి. శివశంకర్.