14 రాష్ట్రాల్లో పోటీ చేస్తాం..!

14 రాష్ట్రాల్లో పోటీ చేస్తాం..!

తృణమూల్ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది.  రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 14 రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. పశ్చిమబెంగాల్‌లో మొత్తం 42 స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ నేత డెరెక్ ఒబ్రెయిన్ తెలిపారు. ఒడిశా సహా మొత్తం 14 రాష్ట్రాల్లో పోటీ చేస్తామని ఆయన భువనేశ్వర్‌లో తెలిపారు. రాబోయే  పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పని ముగుస్తుందని తెలిపారు. పశ్చిమబెంగాల్‌‌లో గత ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాలు మాత్రమే గెలిచింది. తృణమూల్ 34 సీట్లు గెలిచింది. ఎన్డీయేతర కూటమి ఏర్పాటు చేసే లక్ష్యంతో మమత అడుగులు వేస్తున్నారు.