ఆ ఫోనులో ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

ఆ ఫోనులో ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

ప్రస్తుత పోటీ ప్రపంచంలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి మొబైల్ కంపెనీలు పోటీపడుతున్నాయి. కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను చౌక ధరల్లో అందుబాటులోకి తీసుకువస్తుంటే.. మరికొన్ని సంస్థలు సరికొత్త ఫీచర్లతో మార్కెట్లని ముంచెత్తుతున్నాయి. ఒకప్పుడు ఫోన్‌కి ఒక కెమెరా ఉండటమంటేనే అదొక విశేషం.. తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే తొలిసారిగా ఒక్క ఫోన్‌కి బ్యాక్‌ సైడ్ మూడు కెమెరాలతో చైనా మొబైల్ దిగ్గజం తన కొత్త మోడల్ హువాయి పీ20 ప్రోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోన్ వెనుక భాగంలో 40, 20, 8 మెగాఫిక్సల్స్‌తో కెమెరాలను అమర్చింది. వీటికి తోడుగా ఫోన్ ముందు భాగంలో 24 మెగాఫిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

ఇంకా ఈ ఫోన్‌లో ఏమున్నాయంటే.. 

6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే

2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ హువావే కైరిన్ 970 ప్రాసెసర్

6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్

ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి

డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ

డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ

ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

ధర: రూ. 64,999