రేప్ కేసు పెట్టిన మహిళను ఎమ్మెల్యే ఏం చేశాడంటే..!

రేప్ కేసు పెట్టిన మహిళను ఎమ్మెల్యే ఏం చేశాడంటే..!

ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు చేస్తూ కేసు పెట్టిన ఓ మహిళను చివరకు ఆ ఎమ్మెల్యే పెళ్లి చేసుకున్న ఘటన త్రిపురలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే త్రిపురలోని రిమా వ్యాలీ ఐపీఎఫ్‌టీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ధనుంజోయ్‌పై ఆ రాష్ట్రంలోని దలాయికి చెందిన మహిళ మే 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అగర్తలలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో వెళ్లిన ఆమె.. తనపై ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడ్డాడని, తనను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తున్నారని ఫిర్యాదు చేసింది. సదరు ఎమ్మెల్యే కొంతకాలంగా తనతో సన్నిహితంగా మెలిగాడని.. పెళ్లిమాట ఎత్తేసరికి నిరాకరించారని తన ఫిర్యాదులో పేర్కొంది మహిళ. మరోవైపు ఈ కేసు నుంచి బయటపడాలని ఎమ్మెల్యే ధనుంజోయ్ ప్రయత్నించాడు. కేసు నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేయగా... న్యాయస్థానం బెయిల్‌కు నిరాకరించింది. దీంతో కంగుతున్న ఎమ్మెల్యే.. ఆ మహిళనే పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు.. ఆదివారం ఆ మహిళతో ఎమ్మెల్యే వివాహం జరిగిపోయింది. ఇక ఈ వివాహానికి ఇరు కుటుంబాలు హాజరయ్యాయని ఆ పార్టీ నేతలు తెలిపారు.