చిన్నారిపై అత్యాచారం.. సామ్‌, త్రిష‌ ట్వీట్లు

చిన్నారిపై అత్యాచారం.. సామ్‌, త్రిష‌ ట్వీట్లు
జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిపై హ‌త్యాచారం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ దారుణంపై ప‌లువురు సెల‌బ్రిటీలు ట్విట్ట‌ర్ వేదిక‌గా విచారం వ్య‌క్తం చేశారు. నిన్న‌టిర‌జున స్టార్ హీరోయిన్‌ త‌మ‌న్నా ఈ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ .. ఇలాంటి రాక్ష‌సుల‌ను వెతికి ప‌ట్టుకుని థెర‌పీ చేయాలి. దేశంలో మార్పు వ‌చ్చే లోపే ఎంత‌మంది నిర్భ‌య‌లు బ‌ల‌వ్వాలి? అంటూ ఎంతో ఆవేద‌న‌గా ట్వీట్ చేశారు. ఇది కేవ‌లం త‌మ‌న్నా ఆవేద‌న మాత్ర‌మే కాదు. ఎంద‌రో సెల‌బ్రిటీల్లో చ‌ల‌నం తెచ్చిన దారుణ ఉదంత‌మిది. స‌మంత‌, త్రిష‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, జ‌యం ర‌వి, ఆసిఫ్ (మాలీవుడ్‌) వంటి తార‌లు చిన్నారి ఆసిఫా(8)పై జ‌రిగిన దారుణంపై ఎంతో హృద‌య‌వేద‌న‌తో స్పందించారు. ఆ కుటుంబాన్ని చూస్తే క‌డుపు త‌రుక్కుపోతోంద‌ని అన్నారు. మాన‌వ‌త్వం మంట‌క‌లిసిపోయిన ఈ లోకంలో అబ‌ల‌లు బ‌త‌క‌డ‌మెలా? అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌నమంతా ఏక‌మవ్వాల్సిన రోజొచ్చింది. ఇలాంటి దారుణాల‌పై గొంతెత్తాల్సిన టైమ్ ఇదే. అంద‌రూ క‌లిసి క‌ట్టుగా రండి.. నిన‌దిద్దాం.. అంటూ ఉద్వేగంగా ప‌లువురు సెల‌బ్రిటీలు ట్వీట్ చేశారు. `హ్యాష్‌ట్యాగ్ జ‌స్టిస్ ఫ‌ర్ ఆసిఫా` పేరుతో ట్విట్ట‌ర్‌లో పెను ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల వేళ సంఘంలో గుర్తింపు ఉన్న తార‌లంతా స్పందిస్తే, బాధిత కుటుంబానికి న్యాయం జ‌రిగేందుకు ఆస్కారం ఉంటుంది. మాకెందుకులే.. అని బాధ్య‌త లేకుండా గాలికి వ‌దిలేస్తే మ‌న ర‌క్ష‌క‌భ‌ట‌(పోలీస్) వ్య‌వ‌స్థ, రాజ‌కీయ, సామాజిక‌ అవ‌స్థ‌ ఎలా ఉందో తెలిసిందే!!