త్రిష మనసు పడింది !

 త్రిష మనసు పడింది !

 

ఈమధ్యే విడుదలై భారీ విజయం సాధించిన చిత్రం 'బద్లా'.  తాప్సి, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది.  దీంతో దక్షిణాదిలో చాలామంది ఈ సినిమాను రీమేక్ చేయాలని భావించారు.  కానీ ఆ అవకాశాన్ని స్టార్ హీరోయిన్ త్రిష కొట్టేసినట్టు తెలుస్తోంది.  తాప్సి పాత్ర పట్ల బాగా ఇంప్రెస్ అయిన త్రిష ఆ పాత్రలో నటించాలని ఉవ్విళ్లూరుతోందట.  'గగనం' ఫేమ్ రాధామోహన్ ఈ రీమేక్ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.