అన్ని త్రిషాకే..అదెలా..!!

అన్ని త్రిషాకే..అదెలా..!!

త్రిష కృష్ణన్ టాలీవుడ్లో ఒకప్పటి బిజీతార.  స్టార్ హీరోలందరితో నటించింది ఈ చెన్నై బ్యూటీ.  అటు మాతృభాష కోలీవుడ్ లోను సూపర్ గా దూసుకుపోతున్నది.  ఇలా వరసగా కోలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ తార లేటెస్ట్ గా చేసిన 96 సినిమాతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.  

96 సినిమా చూసిన వాళ్లకు త్రిష పెర్ఫార్మన్స్ సూపర్బ్ అని అంటారు.  త్రిష తమిళ అవార్డులతో పాటు టిఎస్ఆర్ అవార్డ్స్, రీసెంట్ గా ఆసియా విజన్ అవార్డును సొంతం చేసుకున్నది.  ఈ అవార్డుకు చాలామంది పోటీ పడ్డారు.  కాలా లోని ఈశ్వరి రావు, వడ చెన్నై సినిమాలోని ఐశ్వర్య రాజేష్, తారామణి నుంచి ఆండ్రియాలు పోటీ పడ్డా చివరకు అవార్డు మాత్రం త్రిషకు దక్కడం విశేషం.