త్రిష అందుకే ఒప్పుకోలేదట..!!

త్రిష అందుకే ఒప్పుకోలేదట..!!

టాలీవుడ్, కోలీవుడ్ లో ఒకనాడు టాప్ హీరోయిన్ గా చెలామణి అయిన త్రిష కెరీర్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది.  ఇప్పుడు ఆమె చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నది.  ఇటీవలే వచ్చిన మోహిని కూడా పెద్దగా మెప్పించలేకపోయింది.  ఈ నెలలో ఆమె నటిస్తున్న 96 విడుదల కాబోతున్నది.  ఈ సినిమా ఎలా ఉంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే.. త్రిషా కు సంబంధించిన ఓ న్యూస్ ఇటీవలే బయటకు వచ్చింది.  

చియాన్ విక్రమ్, త్రిషా జంటగా 2003 లో సామి సినిమా వచ్చింది.  అప్పట్లో అది సంచలన విషయం సాధించింది.  ఈ సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు సామి స్క్వేర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.  హరినే దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా త్రిషాను అనుకున్నారట.  కానీ, త్రిష అందులో నటించేందుకు అంగీకరించలేదట.  కారణం ఏమిటంటే.. ఈ సామి స్క్వేర్ కథ తనకు తగ్గట్టుగా లేదని అందుకే ఆ సినిమాలో నటించలేదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.  త్రిష వదులుకున్న అవకాశం కీర్తి సురేష్ కు దక్కింది.  ఒకవేళ ఈ సినిమా కనుక హిట్టయితే.. పాపం త్రిష మంచి ఛాన్స్ వదులుకున్నట్టే అవుతుంది.