తన సినిమాకు నో చెప్పిన హీరోయిన్ తోనే లెజెండ్ అనిపించుకున్న మెగాస్టార్...

తన సినిమాకు నో చెప్పిన హీరోయిన్ తోనే లెజెండ్ అనిపించుకున్న మెగాస్టార్...

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో తన 152 వ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. కొరటాల టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు. ఆయన తీసిన సినిమాలు అని సూపర్ హిట్స్ కావడంతో మెగా అభిమానులు ఈ సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో  మెగాస్టార్ కు సంబంధించిన ఓ ఫోటో కూడా లీక్  కావడం సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాలో ముందు త్రిష ను చిరుకి జంటగా తీసుకున్నారు కానీ తరువాత తాను ఈ సినిమా నుండు తప్పుకుంటున్నాను అని త్రిష సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇక ఆ తరువాత ఆ స్థానంలోకి కాజల్ ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు తన సినిమాకు నో చెప్పిన హీరోయిన్ తోనే "లెజెండ్'' అనిపించుకున్నాడు మెగా స్టార్. ఏమైందంటే... నిన్న త్రిష పుట్టిన రోజు సందర్బంగా చిరు తన ట్విట్టర్ ఖాతాలో త్రిషకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ చేసాడు. అయితే ఆ పోస్ట్ పై స్పందించిన త్రిష 'థాంక్యూ టు స్వీటెస్ట్ లెజెండ్' అని తెలిపింది. అయితే తన సినిమాకు నో చెప్పిన హీరోయిన్ నోటితోనే లెజెండ్ అనిపించుకున్నాడు చిరు. అయితే గతంలో వీరిద్దరి కంబినేషన్లో స్టాలిన్ సినిమా వచ్చిన విషయం అందరికి తెలిసిందే.