యూట్యూబ్లో మరో సంచలనం.. దూసుకుపోతున్న త్రివిక్రమ్ సినిమా

యూట్యూబ్లో మరో సంచలనం.. దూసుకుపోతున్న త్రివిక్రమ్ సినిమా

హిందీలో డబ్ అయిన తెలుసు సినిమాలకు మంచి డిమాండ్ ఉన్నది.  ముఖ్యంగా యూట్యూబ్లో.  నితిన్ కథానాయకుడిగా, సమంత హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అ.. ఆ.  నితిన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  మొదటిసారి నితిన్ సినిమా యూఎస్ లో రెండు మిలియన్ డాలర్లు కెలెక్ట్ చేసింది.  ఇటు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు చేసి రికార్డ్ సృష్టించింది.  ఈ సినిమాను ఇప్పుడు హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేశారు. 

ఆగస్టు 26 న ఈ సినిమాను యూట్యూబ్ లో ఉంచగా.. కేవలం మూడు రోజుల్లోపే 20 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్నది.  డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో వేగంగా 10 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్న సినిమాగా రికార్డుకెక్కింది.  నితిన్ సమంత జంటగా నటించిన ఈ సినిమా ఎక్కువ భాగం సమంత క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది.  సమంత అందంతోనూ, అమాయకత్వంతోనూ బాగా ఆకట్టుకుంది.  త్రివిక్రమ్ అందించిన కథనాలు, మాటలు ఈ సినిమాకు ప్రాణం పోశాయి.  గతంలో అల్లు అర్జున్ సరైనోడు, దువ్వాడ జగన్నాధం యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.