మళ్ళీ అదే సెంటిమెంట్ తో త్రివిక్రమ్ సినిమా..!!

మళ్ళీ అదే సెంటిమెంట్ తో త్రివిక్రమ్ సినిమా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.  వీరిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి.  జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి.  రెండు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.  ఈ రెండు సినిమాలకు సారూప్యం ఉంది.  రెండింటిలోనూ ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది.  జులాయి కంటే సన్నాఫ్ సత్యమూర్తిలో ఆ పాళ్ళు కొంచెం ఎక్కువ.  

అజ్ఞాతవాసి పరాజయం తరువాత త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేశారు.  ఈ సినిమా మంచి విజయం సాధించింది.  నెక్స్ట్ చేయబోయే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని త్రివిక్రమ్ ఆశిస్తున్నాడు.  అందుకు తగ్గట్టుగానే కథను, తనదైన శైలిలో కథనాలను సిద్ధం చేసుకుంటున్నాడని సమాచారం.  అల్లు అర్జున్.. త్రివిక్రమ్ సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కబోతుందని తెలుస్తోంది.  జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో తండ్రి పాత్రలు చేసిన తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్ లు కాకుండా.. కొత్త వ్యక్తిని ఈ పాత్రకోసం తీసుకోబోతున్నారని తెలుస్తోంది.  కన్నడ నటుడిని ఈ పాత్రకోసం సెట్ చేస్తున్నారని సమాచారం.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.