అల్లు అర్జున్ ను మారమంటోన్న త్రివిక్రమ్..!!

అల్లు అర్జున్ ను మారమంటోన్న త్రివిక్రమ్..!!

అల్లు అర్జున్ నాపేరు సూర్య తరువాత మరో సినిమా చేయలేదు.  చాలా కథలు విన్నా చివరకు, తన కెరీర్లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు మొగ్గు చూపించాడు ఈ స్టైలిష్ స్టార్.  కథ కూడా రెడీ అయింది.  ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం హీరోయిన్లను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.  

ఇదిలా ఉంటె, తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో అల్లు అర్జున్ ను కొత్తగా చూపించే ప్రయాన్తం జరుగుతుందట.  అందుకోసం బన్నీని కొంత వెయిట్ తగ్గి స్లిమ్ గా.. ఫిట్ గా మారమని త్రివిక్రమ్ సూచించినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి ఫస్ట్ వీక్ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం.