త్రివిక్రమ్ జాబితాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ !

 త్రివిక్రమ్ జాబితాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ !

మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.  స్క్రిప్ట్ సిద్ధం చేసి నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు.  తాజా సమాచారం మేరకు అల్లు అర్జున్ తల్లి పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబును తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట.  ప్రస్తుతం హిందీలో మాత్రమే సినిమాల్లో చేస్తున్న టబు త్రివిక్రమ్ కు ఓకే చెబుతారో లేదో చూడాలి.  ఇకపోతే బన్నీ ఈ సినిమా కోసం బరువు తగ్గించుకుంటున్నాడు.  హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయకిగా నటించనుంది.