త్రివిక్రమ్ ను ఇబ్బందిపెడుతున్నారా ?

త్రివిక్రమ్ ను ఇబ్బందిపెడుతున్నారా ?

'అజ్ఞాతవాసి' పరాజయంతో త్రివిక్రమ్ చాలా విమర్శలనే మూటగట్టుకోవాల్సి వచ్చింది.  దీంతో పక్కగా కథను రెడీ చేసుకుని అల్లు అర్జున్ చెంతకు వెళ్ళాడు.  కథ విన్న బన్నీ వెంటనే ఓకే చెప్పేశాడు.  గీతా ఆర్ట్స్, హారిక హాసిని సంస్థలు నిర్మాణానికి ముందుకొచ్చాయి.  కానీ ఆ తరవాతే అసలు కథ మొదలైంది.  త్రివిక్రమ్ చెప్పిన కథకు కొన్ని మార్పులు చెప్పాడట బన్నీ.  త్రివిక్రమ్ కూడా మార్పులు చేశాడట.  కానీ వాటితో బన్నీ సంతృప్తిపడలేదని, ఇంకోసారి చూడమని త్రివిక్రమ్ ను అడిగాడట.  కొంచెం ఇబ్బందే అయినా త్రివిక్రమ్ మార్పులు చేసే పనిలో ఉన్నారట.  దీంతో సినిమా ఇంకా ప్రీప్రొడక్షన్ దశలోనే ఉండిపోయింది.