త్రివిక్రమ్ ను వదలని సెంటిమెంట్...!!

త్రివిక్రమ్ ను వదలని సెంటిమెంట్...!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ టైటిల్స్ విషయంలో చాలా కొత్తగా ఆలోచిస్తున్నాడు.  కొత్తగా ఆలోచిస్తూనే ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు.  అత్తారింటికి దారేది నుంచి ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు.  అ అనే అక్షరం త్రివిక్రమ్ కు సెంటిమెంట్ గా మారిపోయింది.  అత్తారింటికి దారేదిలో, అ ఆ, అరవింద సమేత, ఇప్పుడు అల వైకుంఠపురంలో.. 

సినిమా టైటిల్స్ విషయంలోనే కాదు పాత్రలు పేర్ల విషయంలోను త్రివిక్రమ్ ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.  అ ఆ సినిమాలో హీరోహీరోయిన్ల పేర్లు అనసూయ, ఆనంద్ విహారి.  ఈ రెండు పాత్రల్లోని మొదటి రెండు అక్షరాలు తీసుకొని టైటిల్ పెట్టారు.  అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కూడా అంతే.  ఇందులో పూజా హెగ్డే పేరు అరవింద.. ఇదే పేరుతో సినిమా టైటిల్ మొదలౌతుంది.  అదే విధంగా అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో విషయంలో అదే జరిగింది.  పూజా హెగ్డే పాత్రపేరు అలకనంద.  అందులోని మొదటి రెండు అక్షరాలను తీసుకొని అలా వైకుంఠపురంలో సెట్ చేశారు.  మొదట ఈ సినిమాకు వైకుంఠపురంలో అనుకున్నారు.  కానీ, త్రివిక్రమ్ సెంటిమెంట్ తో అల అక్షరాలను ముందు చేర్చారు.