త్రివిక్రమ్ దగ్గర 2 వేల కోట్ల సినిమా ఉందా !

త్రివిక్రమ్ దగ్గర 2 వేల కోట్ల సినిమా ఉందా !

తెలుగు స్టార్ దర్శకుల్లో త్రివిక్రమ్ కూడా ఒకరు.  తన రచన శక్తితోనే సినిమాను ముందుకు నడిపేయగల సామర్థ్యం ఉన్న దర్శకుడు.  ఈయన రాసుకునే కథలు కూడా భిన్నంగా ఉంటాయి.  వీటి గురించే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రివిక్రమ్ స్నేహితుడు సునీల్ త్రివిక్రమ్ ఒకరోజు నన్ను కూర్చోబెట్టి 2000 కోట్ల బడ్జెట్ కథ చెప్పాడు అన్నారు.  దీంతో అంత భారీ బడ్జెట్ కథ అంటున్నారు ఇంతకీ ఏమై ఉంటుంది, త్రివిక్రమ్ దాన్ని వర్కవుట్ చేస్తాడా, చేస్తే ఎవరితో చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.  మరి వీటికి సమాధానం త్రివిక్రమే చెప్పాలి.